![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -291లో.. కృష్ణ కోసం ప్రభాకర్ భవాని ఇంటికి వస్తాడు. అక్కడ ప్రభాకర్ ని అవమానిస్తుంది ముకుంద. భవాని కూడా కృష్ణ తనని మోసం చేసినట్లు మాట్లాడేసరికి.. ప్రభాకర్ కి ఏం అర్ధం కాదు. అసలేం జరిగిందంటూ ప్రభాకర్ అడుగుతాడు. అప్పుడు పక్కనే ఉన్న ముకుంద.. కృష్ణ మురారిలది పెళ్లి కాదు అగ్రిమెంట్ మ్యారేజ్ అని చెప్పగానే ప్రభాకర్ షాక్ అవుతాడు.
ఆ తర్వాత ఇన్ని రోజులు కృష్ణ పై దాచుకున్న కోపాన్ని మొత్తం బయటకు చూపిస్తుంది ముకుంద. మీ కృష్ణ మా ఇంట్లో మా డబ్బులతో చదువుకుందంటూ కృష్ణ పై లేనిపోనివి చెప్తుంది. ఆ తర్వాత మా కృష్ణ అలా చెయ్యదు. మీరు చెప్పేది అబద్ధమని నేను నిరుపిస్తానని ప్రభాకర్ అక్కడ నుండి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ప్రభాకర్ వెళ్లిపోతుంటే రేవతి అడ్డుపడి.. జరిగిందంతా ప్రభాకర్ కి చెప్తుంది. ఇప్పుడు కృష్ణ మురారీలకి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. మీరు టెన్షన్ పడకండి.
కృష్ణ వచ్చాక మీకు ఫోన్ చేస్తానని రేవతి చెప్పి వెళ్ళిపోతుంది. మరొక వైపు కృష్ణ మురారి లు కార్ లో వెళ్తుంటారు. కృష్ణ చాలా హ్యాపీగా ఉంటుంది. మురారి కూడా తనని ప్రేమిస్తున్నాడని సంబరపడిపోతుంది. ఐ లవ్ యూ అని కృష్ణ చెప్తుంది. ఆ తర్వాత వెనకాల నుండీ లారీ వచ్చి మురారి కృష్ణలు వెళ్తున్న కార్ కి డాష్ ఇవ్వడంతో కిందపడిపోతారు. ఆ తర్వాత లారీలో నుండి ఒక అతను బయటకు దిగి వస్తాడు. ఆ తర్వాత వ్యక్తి శ్రీనివాస్ ఇంటికి వెళ్తాడు. తీరా చూస్తే అతను శ్రీనివాస్ కొడుకు, ముకుందకి అన్నయ్య. అతన్ని చూసిన శ్రీనివాస్ జైల్ నుండి ఎప్పుడు వచ్చావ్? ఎందుకు వచ్చావ్ అని కోప్పడతాడు. దానికి అతను.. భోజనం చేసి వెళ్ళిపోతానని వెళ్లి భోజనం చేస్తుంటాడు.
ఆ తర్వాత ముకుంద అక్కడకీ రావడం గమనించిన శ్రీనివాస్. ముకుందని చూస్తే తన సిచువేషన్ వీనికి తెలిస్తే ప్రాబ్లమ్ అని ముకుంద లోపలికి రాకముందే శ్రీనివాస్ బయటకు వెళ్లి మాట్లాడతాడు. అప్పుడే లోపల నుండి ముకుంద వాళ్ళ అన్నయ్య వచ్చి శ్రీనివాస్ ని చెంప పై కొడతాడు. ముకుంద తన అన్నయ్యకి జరిగింది మొత్తం చెప్తుంది. నీకు నచ్చినవాడితో నేను పెళ్లి చేస్తానని ముకుంద వాళ్ళ అన్నయ్య చెప్తాడు. ముకుంద హ్యాపీగా ఫీల్ అవుతుంది. ముందు నువ్వు నాన్నని కొట్టావ్ సారి చెప్పు అని ముకుంద అంటుంది. ఆ తర్వాత జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |